Quantcast
Channel: PHANI BABU -musings
Viewing all articles
Browse latest Browse all 266

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు …కంఠశోష..

$
0
0

 ఈ కరోనా ధర్మమా అని,  ఈ ఏడాది ఉగాది ముందరనుంచీ , బయటకు అడుగుపెట్టలేదు… పిల్లలతో కలిసి ఉన్నవారికి ఎటువంటి సమస్యా లేదు. కానీ, పిల్లలు పరాయి దేశం లోనో, పొరుగూరిలోనో ఉంటే ఎలా ? నిత్యావసర సరుకులు, ఈ కరోనా వచ్చిన ప్రారంభంలో, ప్రభుత్వాలు, కొందరు సమాజ సేవకులూ , నెలకి సరిపడా సరుకులు ,ఇళ్ళకి డైరెక్ట్ గా పంపిణీ చేసారు.. అలాగని దేశమంతా చేసారనుకుంటే పొరపాటే..ఏవో కొంతమందికే అలాటి అదృష్టం వరించింది.. మామూలుగానే ఇక్కడ కూడా  “  Vote Bank Politics “  రంగంలోకి వచ్చింది.. ఏదో  ముందర  BPL వాళ్ళకన్నారు, తరవాత “ వలస కూలీలకి “ అన్నారు..

ఏ క్యాటగిరీకీ చెందని , మధ్యతరగతి వారిని, అక్కడక్కడ తప్ప, ఎవరూ పట్టించుకోలేదన్నది నిజం  .. ఏవిషయంలో చూసినా, మధ్యతరగతివారే ఎటూకాకుండా పోతూంటారు.. ప్రభుత్వ రాయితీలకి అనర్హులు ( గవర్నమెంట్ వారు పెట్టిన  eligibility  ధర్మమా అని ), పోనీ, పంపిణీ చేస్తూన్నప్పుడు , క్యూలో నుంచుందామా అనుకుంటే, నామోషీ ( మధ్యతరగతి  false prestige),  “ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో” Syndrome..ఇలా ఎందుకూ పనికిరాకుండాపోయారు..

  ఈరోజుల్లో ఉద్యోగాలు చేస్తూన్నవారికి, నిత్యావసరసరుకులు తెప్పించుకోవడంలో, అంత ఇబ్బంది ఎదురవలేదు.. కారణం.. ఎప్పటినుంచో ఏది కావాల్సినా  Online  లోనే  order  చేసి క్షణాల్లో తెప్పించుకోవడం అలవాటే కాబట్టి..మొదట్లో బయటి హొటళ్ళు కూడా బంద్ గా ఉండడం మూలాన, తిండి పదార్ధాలు—పిట్జాలు, సబ్ వేలూ.. లాటివి కుదరలేదు.. ఎలాగోలాగ నిత్యావసర సరుకులు తెప్పించుకుని, మొత్తానికి, భార్యాభర్తలిద్దరూ శ్రమపడి, కానిచ్చేసారు.. ఇదివరకటిలాగ కాదు కదా, అందరూ  Work from Home , చదువులతో సహా…తల్లితండ్రుల మాటెలా ఉన్నా, పిల్లలకోసమైనా ఏదో ఒకటి వండిపెట్టాలేకదా.. ఈ సందర్భం లో, పిల్లల్ని చూడ్డానికి పొరుగూరునుండి, వచ్చిన తల్లితండ్రులు , కరోనా ధర్మమా అని చిక్కడిపోయారు… ఏదో కొడుకు/ కూతురు దగ్గరున్నామని సంతృప్తి తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదు.. బయటకు వెళ్ళడానికి వీలులేదూ, ఇంట్లో కొత్తగా మరో బాధ్యత—మనవలు, మనవరాళ్ళ బాగోగులు చూడ్డం.. వాళ్ళ తల్లితండ్రులేమో ఆఫీసు పనిమీద ఉంటారు కాబట్టి.. రైళ్ళ రాకపోకలు, రవాణావ్యవస్థా  మధ్యలో పునరుధ్ధరించారు.. పోనీ , స్వగ్రామం వెళ్ళిపోదామా అనుకున్నా, పిల్లలు ససేమిరా వెళ్ళనీయరు.. అంతదూరం వెళ్ళి ఏం చేస్తారూ? మీకేమైనా జరిగితే , మాకు రావడానికి వీలుపడదాయే.. కష్టమో నిష్టూరమో ఇక్కడే ఉండండీ.. అనేస్తారు పిల్లలు.. అదీ నిజమే కదా, నాకు తెలిసిన చాలా సందర్భాల్లో, తండ్రి స్వర్గస్థులయినా, వెళ్ళలేకపోయారు.. పొరుగూరు మాట దేవుడెరుగు, ఉన్న ఊళ్ళోనే ఉంటూ, అంతిమ సంస్కారాలు కూడా చేయలేకపోయారు కొందరైతే..విదేశాల్లో ఉండేవారు రాగలరని ఆశించడం కూడా అనవసరం.. అంత తీవ్రంగా ఉంది పరిస్థితి ఇప్పటికీ..

 ఒకవైపున చెప్తూనే ఉన్నారు, అదేదో వాక్సీన్  వచ్చేదాకా, మొహానికి  mask, social distancing  మాత్రమే గతీ.. అని.. ఆ వాక్సీన్ అసలంటూ వస్తుందా, వస్తే ఎప్పటికీ అన్నది ఆ దేవుడికే తెలియదు.. పైగా ఈ కరోనా కి స్వ పర అంటూ తేడాలేదు..  Universal Brotherhood  లాగ అమెరికా ప్రెసిడెంట్ తో సహా, ఎంతోమంది దేశాధినేతలు,రాజకీయనాయకులు,  so called  సెలెబ్రెటీ లని కూడా వదల్లేదు.. ఈ గొప్ప గొప్పవాళ్ళందరూకూడా, సామాన్య ప్రజానీకం కంటే  more hygienic safe and secure environment  లోనే  కదా ఉంటున్నదీ.. మరి వారికి ఎలా తగిలిందిట? దేనికీ రేషనల్ సమాధానం మాత్రం లేదు..

ఒకవైపున కరోనా మహమ్మారి సరిపోదన్నట్టుగా, తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్యన వచ్చిన విపరీతమైన వర్షాలూ, వరదలూ.. హైదరాబాదు నగరాన్ని ఓ కుదుపు కుదిపేసింది..  As usual  గట్టిగా వర్షాలొస్తే, నీళ్ళు బయటకి వెళ్ళడానికి దారిలేక , ఇళ్ళల్లోకి ప్రవహిస్తాయి.. ఇలా జరిగినప్పుడల్లా,  Usual, ever green బహానా..  unauthorized encroachments .. అందరికీ తెలిసిందే ఈ విషయం.. అయినా సరే వరద ఉన్నంతకాలమూ, మీడియా వారికి ఓ కాలక్షేపం.. రాజకీయనాయకులకైతే ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడంతోనే సరిపోతుంది..  ఓ మినిస్టరెవడో , మూతికి గుడ్డలు కట్టుకుని రావడం, అక్రమ కట్టడాలు ఇదిగో కూల్చేస్తున్నాం.. అదిగో కూల్చేస్తున్నాం అంటూ పేద్ద పెద్ద ప్రకటనలూ, మీడియా కవరేజీ.. అదేదో సినిమా సెట్టింగ్ లాటిదాన్నీ కూల్చేస్తూన్న విడియోలూ… బలే entertainment  లెండి.. ఇలా అంటున్నందుకు క్షమించాలి.. ఓవైపున ప్రజలకి అంత కష్టం వస్తే అది మీకు  entertainment  లా కనిపిస్తోందా అని కోప్పడకండి..నిజంగా జరుగుతున్నదదే.. ఈ ప్రకటనల ధర్మమా అని జరుగుతున్నదేమంటే, అక్రమ కట్టడాల యజమానులకి, కోర్టులకి వెళ్ళి Stay  తెచ్చుకోదానికి కావాల్సినంత టైము దొరుకుతోంది..అసలు ఇలాటివి కట్టిందెవరుట? మన రాజకీయనాయకులే.. ఒకడు అధికారంలో ఉన్నప్పుడు,మరో రాజకీయనాయకుడికి అన్యాయం జరగనీయరు ఈ దౌర్భాగ్యులు.. “ నా వీపు నువ్వు గోకూ.. నీ వీపు నేను గోకుతానూ..” ఇద్దరం మజా చేద్దాం.. that’s the bottomline for this drama.  పైగా వరదలొచ్చిన ప్రతీసారీ.. అది ఏ నగరమైనా సరే ఇదే  Screen play  చూస్తున్నాము.. ఎన్నో ఏళ్ళనుంచి.. వీటినుంచి విముక్తి పొందడం చాలా కష్టం.. నిన్న టీవీ లో ఒకన్యూస్.. హైదరాబాదు లో వరదబాధితుఅలకి ఇస్తూన్న 10,000 రూపాయలలో, సగం, లోకల్ లీడర్స్ నొక్కేస్తున్నారుట.. ఓ విషయం అర్ధమవదూ.. జనాలకి బ్యాంక్ ఎకౌంట్లు తెరిచారని , ఎప్పుడో విన్నాము.. అందులోకి నగదు బదిలీ చేయొచ్చుగా, మరీ లిక్విడ్ కాష్ ఇవ్వాలా?  ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక..

 Life goes on…


Viewing all articles
Browse latest Browse all 266

Trending Articles


మరదలితో శృంగారం చేద్దామంటే చేతకాలేదు... ఆమె అనుమానంగా చూస్తోంది...


అంగ ప్రవేశం వద్దంట.. హస్త ప్రయోగంతో తృప్తిగా ఉందట.. ఏం చేయాలి?


మీరు లోకమునకు వెలుగై యున్నారు


‘మనుచరిత్ర ప్రబంధ దర్శన’ దర్శనం


TELUGU PATHAM తెలుగు పథం: కళ్యాణ జాతక విశ్లేషణ Kalyana Jataka Vishleshana


ఆంటీతో సెక్స్‌లో పాల్గొన్నా.. వేస్ట్‌గాడివని సర్టిఫికేట్ ఇచ్చింది.. ఏం చేయాలి?


ఆమె నన్నలా హత్తుకోగానే నా ప్యాంటూచొక్కా తడిసిపోయింది... ఎందుకని?


‘కడలి అంచులు దాటి.. కదిలింది తెలుగు’


సానుభూతి ఒక ఆయుధం


నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య