Quantcast
Channel: PHANI BABU -musings
Viewing all articles
Browse latest Browse all 266

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. ” Damini” revisited…

$
0
0

ఒకానొకప్పుడు అంటే నైతిక విలువల కి పెద్దపీట వేసిన రోజుల్లో, పరిస్థితులు మరీ, ఈరోజుల్లోలాగ దిగజారిపోవడం చూడలేదు.. ఆడపిల్లలు , ఆరోజుల్లో వీధిగుమ్మం చూసేవారే కాదూ.. కాలక్రమేణా, వారు కూడా పెద్దపెద్ద చదువులు చదివి, అన్ని రంగాల్లోనూ పైకి వస్తున్నారు.. అదో  మంచి మార్పు..  ప్రపంచమంతా మారుతున్నా, ఇంకా దేశంలో కొన్నిప్రాంతాల్లో, ఆడపిల్లలని చిన్నచూపుచూడ్డం దురదృష్టకరం..కొన్నిచోట్లైతే, అదేదో “ లింగనిర్ధారణ పరీక్ష” చేయించుకుని, ఆడపిల్లయితే , అబార్షన్ కూడా చేయించుకునే, దౌర్భాగ్యులు ఇంకా చాలామందే ఉన్నారు.. ప్రభుత్వం , అలాటి పరీక్షలను నిషేధించింది.. అయినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి .

  అయినా, నూటికి తొంభై మంది , ఇంట్లో మొదట ఆడపిల్లే రావాలనేవారే.. ఇంటికి ఆడపిల్ల తెచ్చే అందమే వేరు కదా..   దేశంలో ఎన్ని చట్టాలున్నా, ఇప్పటికీ ఆడపిల్లకి, ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వడంలేదు మన సమాజం.. అప్పటికీ ,  ఆడపిల్లకి, ఓ వయసొచ్చినప్పటినుండీ, తల్లి తండ్రులు బోధిస్తూనే ఉంటారు.. “bad touch, good touch”  ల ఉండే తేడా..పాపం తల్లితండ్రులు ..వారి భయాలు వారివీ..సమాజంలో జరుగుతూన్న మార్పులకి తోడు, మనుషుల దృష్టికోణాల్లోనూ, మనస్థత్వాల్లోనూ కూడా విపరీతమైన మార్పులు వచ్చాయి.. ఒకానొకప్పుడు , వార్తాపత్రికల్లో ఎన్నో ఎన్నెన్నో మంచివిషయాల గురించి రాసేవారు.. ఈ రోజుల్లో వార్తాపత్రిక తెరిస్తే , కనిపించేవి.. ఫలానా చోట  “మహిళ మీద అత్యాచారం..” పోలీసులు కేసు విచారిస్తున్నారూ.. ఇవే వార్తలు.. వాటికి సాయం కొన్ని కొన్ని జాతీయ వార, మాస పత్రికలు.. ప్రతీ ఏడాదీ వారి  circulation  పెంచుకోడానికి, తప్పనిసరిగా , సెక్స్ గురించి అవేవో సర్వేలని పేరుపెట్టి ప్రచురించడం.. ఆ పత్రికలు hot cakes  లా అమ్ముడైపోవడం.. ఏమైనా అంటే పాఠకుల్లో  awareness  పెంపొందించడానికీ.. అని ఓ కుంటి సాకు చెప్పడం..

  ఒకానొకప్పుడు,  సెన్సార్ బోర్డనేది ఉందో, ఊడిందో ఎవరికీ తెలియదు..ఒకానొకప్పుడు, బహిరంగంగా ముద్దులు, వస్త్రధారణ ల మీదా ఓ రకమైన నియంత్రణ ఉండేది.. అవన్నీ ఎప్పుడూ 80 ల దాకా.. ఆ తరవాత పారదర్శకత (  transperancy) పేరుతో , అన్నీ అటకెక్కేసాయి..ఇప్పుడు ఎక్కడ చూసినా,సెక్స్ కే ప్రాధాన్యం.. వాటికి సాయం, కొత్తగా ప్రాచుర్యం చెందిన   O T T Platforms  లో అసలు , అలాటివేమీ ఉండవు.. భాష అయినా, మరో విషయమైనా .. చూసినవాడికి చూసినంత..ఏదో ఈమధ్యన వాటికి కూడా సెన్సారింగ్ ఉంటుందని ప్రకటనలైతే వస్తున్నాయి.. అయినా మన దేశం లో చట్టాల దారి చట్టాలదే.. నేరాల దారి నేరాలదే.. అందరికీ తెలిసిన విషయమే.. ఎక్కడైనా దేశంలో ఓ సంఘటన జరిగితే..   నేరం చేసిన వాడి ఆర్ధికస్థితి మీదే ఆగే కీ కహానీ.. నడిచేది..ఊరికి ముందర “ ముందస్తు బెయిల్” అంటాడు.. అది దొరక్క అరెస్టయితే “ రాజకీయ కుట్ర” అంటాడు.. అదీ కుదరకపోతే వాడి “కులం” తిసుకొస్తాడు..అయినా మన దేశంలో కోర్టుల్లో వ్యవహారాలు తేలేటప్పటికి శతాబ్దాలు మారిపోతాయి..

 అలాగని మన న్యాయవ్యవస్థ అంత మరీ భ్రష్టు పట్టాలేదూ.. ఎక్కడైనా నేరం , అదీ స్త్రీల మీద అత్యాచారం లాటివి జరిగినప్పుడు, అక్కడుండే సెషన్స్ కోర్టులో, శిక్షపడుతుంది.. కాదనడంలేదు.. అదేవిటో చిత్రం, ప్రతీ నేరస్థుడికీ, వాడి తరఫున వాదించే లాయరుకీ కూడా తెలుసు.. పై కోర్టులో నెగ్గుతామని..

 ఈమధ్యన అంటే గత వారంరోజులుగా వార్తల్లో చూస్తూన్న విషయాలు..

1.

“Justice Pushpa Ganediwala of the Nagpur bench of the Bombay High Court, in a judgement passed on January 19, the detailed copy of which was made available now, held that there must be “skin to skin contact with sexual intent” for an act to be considered sexual assault.

She said in her verdict that mere groping will not fall under the definition of sexual assault.

2.

“”The acts of ‘holding the hands of the prosecutrix (victim)’, or ‘opened zip of the pant’ as has been allegedly witnessed by the prosecution witness (mother of the girl), in the opinion of this court, does not fit in the definition of ‘sexual assault’,” Justice Ganediwala said.”

 చిత్రం ఏమిటంటే పై judgements రెండూ కూడా, ఓ మహిళా జడ్జ్ ఇచ్చినవే.. మొదటి దానిమీద సుప్రీం కోర్టు  stay order ఇచ్చారు..

ఓ విషయం అర్ధమవదు.. అందరూ చదివిన చదువులు ఒకటేగా.. ఏమైనా అంటే  interpretation  వేరుగా ఉంటుందీ.. అందుకనే కింది కోర్టుల్లోవి, పై కోర్టుల్లో కొట్టేస్తూంటారూ అని.. మరి అలాటప్పుడు, అదేదో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో అన్ని వివరంగా,  confusion  లేకుండా, మార్పులు చేయడానికి ఏమిటి సమస్యా? అంటే అలాగంటూ  చేస్తే, మన రాజకీయనాయకులు ఇరుక్కుపోతారని భయమయుంటుంది..

  1993 లో ఓ హిందీ సినిమా వచ్చింది  “  Damini “  అని గుర్తుందా? ఆ తరవాతకూడా ఇదే టాపిక్ మీద చాలానే వచ్చాయి.. కానీ, ఈ సినిమా కి వచ్చిన పేరు మరే సినిమాకీ రాలెదు.. ఏమిటో ఆ సినిమా గుర్తుకొచ్చింది..

   Keeping fingers crossed…


Viewing all articles
Browse latest Browse all 266

Trending Articles


మరదలితో శృంగారం చేద్దామంటే చేతకాలేదు... ఆమె అనుమానంగా చూస్తోంది...


Padmarpita...: అనుబంధాల అంగడి


ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు


నా ఆలోచనల పరంపర: నన్ను చూశాడు


Telugu Anuvadam | తెలుగు అనువాదం: శూన్యం నుంచి పూర్ణం వరకు


ఆంటీతో సెక్స్‌లో పాల్గొన్నా.. వేస్ట్‌గాడివని సర్టిఫికేట్ ఇచ్చింది.. ఏం చేయాలి?


ఈ ఒక్క ఆకు శృంగార సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది....


ఆమె నన్నలా హత్తుకోగానే నా ప్యాంటూచొక్కా తడిసిపోయింది... ఎందుకని?


అల్లుడితో అత్త రాసలీలలు.. కొడుకు మొబైల్‌లో వీడియోలు


నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య