కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, అంటే, టెలివిజన్లు వచ్చిన కొత్తలో కూడా, సినిమాలు , సపరివారకుటుంబ సమేతంగా చూడగలిగేవిగానే ఉండేవి.. మరీ ఈ రోజుల్లో ఉన్నట్టు , విచ్చలవిడిగా ఉండేవి కావు. అలాగని నేనేదో ఛాందసుడినని అనుకోవద్దు. దేనికైనా ఓ ‘ హద్దు’ ఉంటుంది… సన్నని గీత లాగ… అది దాటితే అసహ్యం వేస్తుంది… చూడగా చూడగా వెగటుకూడా పుట్టే అవకాశం ఉంది. ఈ విషయం, నిర్మాతలకి, దర్శకులకీ తెలియదంటారా? లక్షణంగా తెలుసు..అయినా రాత్రికి రాత్రి డబ్బుచేసుకోవడమే వారి టార్గెట్..
ఈరోజుల్లో ఎలాటి శ్రమా లేకుండానే, మన ఇంట్లోనే కూర్చుని చూసే సౌలభ్యం, ప్రస్తుతం టీవీ/ స్మార్ట్ ఫోన్ ల ధర్మమా అని లభిస్తోంది. O T T లలో చూపించే, Web Series, Movies వీటికి ప్రత్యక్ష సాక్ష్యాలు. వీటికి కూడా ఏదో censoring ఉంటుందని అప్పుడెప్పుడో ప్రకటించారు. ఆ విషయం అనుకున్నట్టుగానే, ప్రకటనకే పరిమితమయింది. మన సినీప్రముఖులు అలాటివి జరగనిస్తారని ఆశించడం కూడా తప్పే.. ఎంతోమందికి stakes ఉన్నాయి …
ఒకానొకప్పుడు గుర్తుందా… బ్లూ ఫిల్మ్స్ అని ఉండేవి.. మరీ పబ్లిగ్గా చూడ్డానికి వెనకాడేవారు..పైగా రహస్యంగా అలాటివి ప్రదర్శించే స్థలాలని, పోలీసులు raids చేసి , వేసేవారినీ, చూసేవారినీ కూడా అరెస్ట్ చేసేవారు.
ఒకానొకప్పుడు సెన్సార్ వారు, ఓ అభ్యంతరకరమైన మాట / సంభాషణ / డాన్స్ లాటివి ఏదున్నా, పుటుక్ మని కట్ చేసేయడమే.. కొన్ని కొన్ని విషయాలైతే.. Viewer’s imagination కే వదిలేసేవారు.. ఉదాహరణకి , ఏ స్త్రీమీదైనా అత్యాచారం జరిగితే.. ఏవేవో figurative /graphic గా చూపించేవారు. శృంగారం విషయానికొస్తే .. ఓ రెండు పువ్వులూ, ఓ తుమ్మెద తో చూపించి పని కానిచ్చేసేవారు. కాలక్రమేణా, ఆర్ధిక సంస్కరణలతో పాటు, ప్రతీ రంగం లోనూ “ సంస్కరణలు” రావడం ప్రారంభమయింది.. దానికి సాయం ఓ కొత్త స్లోగన్ “ పారదర్శకత్వం ( Transparency)” రంగం లోకి వచ్చేసింది.. Nothing should be left for imagination.. it should be crystal clear.. అంతే.. దురదృష్టం ఏమిటంటే, దీన్ని selective గా ఉపయోగించడం.. అదేదో R T I ( సమాచార హక్కు) అన్నారు.. దేశంలో ఏ పౌరుడైనా, ఏ విషయం గురించైనా అడిగే హక్కు..ప్రభుత్వాలను ఇరుకులో పెట్టే “ విషయాలు” ఈ చట్ట పరిధిలోంచి తీసేసారు.చట్టాలు చేసినట్టూ ఉంటుంది.. కావాల్సినవేవీ చెప్పాల్సిన అవసరమూ ఉండదూ..ఉభయతారకం.
ఒకానొకప్పుడు “ మేధావులు” కొందరు, మన దేశ సంస్కృతి , Western Culture వలన భ్రష్టు పడిపోతోందని ఎలుగెత్తి అరిచిన రోజులు చూసాము… చూసామేమిటిలెండి, ఇప్పటికీ టీవీ ల్లో జరిగే “ అర్ధవంతమైన చర్చ “ ల్లో చూస్తూనే ఉన్నాము. ఆ చర్చ లే ఓ పేద్ద కామెడీ..ప్రతీవాడు తన అమూల్యమైన Expert advice ఇచ్చేవాడే..
అసలు చెప్పాలంటే , ఈరోజుల్లో వస్తూన్న వివిధ భాషల్లో వచ్చే సినిమాలు చూడ్డానికి అసహ్యం వేస్తోంది.. ఒకానొకప్పుడు, మలయాళం సినిమాల మీద పడి ఏద్చేవారు.. వాళ్ళ సినిమాలన్నీ adult content అని… కానీ ఈ రోజుల్లో వారు తీసే సినిమాలే dignified గా ఉన్నాయి, ఓ కథా కమామీషూ కూడా ఉంటోంది. హిందీ కొంచం పరవాలేదు.. మరాఠీ సినిమాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా బాగానే ఉంటున్నాయి.
అసలు దౌర్భాగ్యమంతా మన తెలుగు భాషా చిత్రాలతోనే..
హీరోకీ విలన్ కీ తేడా తెలియదు.. అందరూ “ బూచాడు’ గెడ్డాలతోనే.. ఏదో ప్రాంతీయ యాస ముసుగులో అర్ధం కాని భాష..ఉన్న గంట/ గంటన్నర సినిమాలోనూ , viewer’s imagination అవసరం లేకుండా, విచ్చలవిడి శృంగారం చూపిస్తే డబ్బులొచ్చేస్తాయనే అపోహ..మామూలుగా కాపరాలు చేసుకునే సంసారుల కి కూడా అంతంత శృంగారాలు చేసుకునే టైముంటుందనుకోను.. Just disgusting… అలాటప్పుడు చూడ్డం ఎందుకూ అని అడగొచ్చు.. బుధ్ధిలేక, తిన్న తిండరక్కా..అనే చెప్పాలి.
ప్రతీ రోజూ టీవీ లో న్యూస్ చూసినా, పేపర్లలో వార్తలు చదివినా, ఎక్కడో ఎవడో అత్యాచారం చేసారనే వార్తే.. ఆ చేసినవాడదృష్టం బాగోపోతే, ఓ మూడురోజులు కనిపించకుండా పోయినా, నాలుగో రోజు ఏ రైలు పట్టాలమీదో శవమై తేలుతాడు..లేదా పట్టుబడినా, బెయిల్ దొరకడం ఏమంత పెద్దపనీ కాదూ.. ఏనైనా అంటే.. not guilty till proved..ఆమధ్యన వాడెవడో ఓ ప్రముఖ నటి భర్త ట. హాయిగా బెయిల్ మీదొచ్చేసాడు.. అలాగే డ్రగ్స్ కేసులు.. మీడియాలో కొట్టుకు ఛస్తున్నారు..
మరి ఈ ఐడియాలన్నీ ఎవరి ధర్మం ట? మన నాయకులూ, మన సినిమాలూ..నూటికీ కోటికీ ఓ మంచి సినిమా by mistake and not by intention రావొచ్చు..
మన “మేధావులు” ఈరోజుల్లో O T T ల్లో వచ్చే తెలుగు “ కళాఖండాల” మీద తమ అమూల్యమైన “ అభిప్రాయా”లని, సోషల్ మీడియా ద్వారా చెప్తూంటారు… ఏ సినిమా అయినా “ఆర్ట్” క్యాటగీరీయే వాళ్ళకి.. వీరి పరిభాషలో “ ఆర్ట్” అంటే శృంగారం అన్నమాట.. ఇదివరకటి రోజుల్లోనూ వచ్చేవి ఈ “ ఆర్ట్” సినేమాలు.. ఉదాహరణకి షబానా ఆజ్మీ, అలాటి చాలా సినిమాల్లో నటించారు..అలాగే స్మితాపాటిల్ కూడా.శ్యాంబెనెగల్ లాటి దర్శకులు.. శృంగారాన్ని కూడా dignified, polished గా చూపించేవారు..
అసలీ గొడవంతా ఎందుకంటే, ఓ పెద్దాయన, అమెరికా నుండి ఓ సాహిత్య అంతర్జాల మాస పత్రిక నిర్వహిస్తూంటారు.. ఆయన Facebook లో ఓ తెలుగు సినిమాగురించి ప్రస్తావిస్తూ.. తాను చూడలేనందుకు ఎమ్తో బాధపడుతూ ఓ పోస్ట్ పెట్టారు.. సినిమా పేరు “ ప్రియురాలు”.. అయ్యో పాపం.. చూడలేకపోయారూ,, మనకి O T T లో అందుబాటులో ఉందీ.. పోనీ చూద్దామూ.. అంత పెద్దాయన చెప్పారూ .. అనుకుని చూసాను..
అసలు ఆ సినిమాద్వారా ఏం చెబ్దామనుకున్నాడో ఆ దర్శక నిర్మాత అర్ధం అవదు.. పావుగంటకో సారి మంచం మీదపడి దొల్లడం, ముద్దులు పెట్టుకోవడం.. వీళ్ళిద్దరికీ సాయం మరో జంట శృంగారం కూడా బోనస్.
మరో విచిత్రం.. హీరో గారిని హీరోయిన్ మొదటి సారి చూసినప్పుడు వాడు పై బట్టలేకుండా ఓ “యజ్ఞోపవీతం” తో కనిపిస్తాడు.. తరవాత మళ్ళీ కనిపించదు, పైబట్ట లేకుండా కూడా.. ఏమో పొరబడ్డానేమో అనుకున్నా… అబ్బే , హీరో తండ్రి అడుగుతాడు..” నీ జంధ్యం ఏదిరా? తప్పు చేస్తున్నావని తీసేసావా..? “ అంటూ..మరో విషయం..రెండు జంటలవి కూడా , infidelity కేసులే..
సినిమా ద్వారా ఏం “ నీతి” బోధించాలనుకున్నారో ఆ సినిమా, దర్శక, నిర్మాత,రచయిత… ఆ భగవంతుడికే తెలియాలి.
ఈమధ్యన ఈ O T T ల్లో వస్తూన్న సినిమాలు ఒకదాన్ని మించి మరోటి దౌర్భాగ్యంగా ఉంటున్నాయి.
సర్వేజనా సుఖినోభవంతూ…