Quantcast
Channel: PHANI BABU -musings
Viewing all articles
Browse latest Browse all 266

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– pets పెంచేవాళ్ళకి శుభవార్త…

$
0
0

    నాకు కుక్కలంటే మహా భయం. ఏంచేయనూ ? ఇదివరకు ఒక టపా కూడా పెట్టాను ఈ విషయంలో. దేనికైనా phoebia లాటిది వచ్చిందీ అంటే దాంట్లోంచి బయట పడడం చాలా కష్టం అవుతుంది.అందులోనూ డెభైయ్యో పడిలో పడ్డ తరువాతైతే ఇంకా కష్టం. ఈవయస్సులో లేనిపోని సాహసకార్యాలు చేయాలనే ఉద్దేశ్యం కూడా ఏమీ లేదు. ఏదో నాదారిన నన్ను వెళ్ళిపోనిస్తే ప్రాణానికి హాయి. కుక్కలని పెంచేవారు అనుకోవచ్చు- ఈమాత్రందానికే అంత భయపడాలా అని. కానీ నాభయం నాది.వాటి జోలికి నేను వెళ్ళను.కొంతమంది నవ్వుకోవచ్చు. సైకిలు తొక్కడం రాదు, నీళ్ళమీద ప్రయాణం చేయాలంటే భయం. ఇంక ఏరోప్లేన్ అంటే చచ్చేభయం.అసలు ఇన్నేసి భయాలు పెట్టుకుని ఎలా బ్రతుకుతున్నారూ అనుకోవచ్చు, బ్రతుకుతున్నానుగా ఇన్నేళ్ళూ? అదీ ఓ బ్రతుకేనా అనికూడా వేళాకోళం చేయొచ్చు.ఎవరి comfort zone వాళ్ళదీ. అయినా ఇన్నేళ్ళ తరువాత what is there to prove? అనేది నా సిధ్ధాంతం.

    మేము ఉండే సొసైటీలో ఒకళ్ళ దగ్గరైతే భీకరమైన కుక్క ఉంది.ఇంక మా సందులో అయితే అడక్కండి, ఓ డజనుదాకా ఉన్నాయి.మా సొసైటీ వారైతే ఆ కుక్కగారి నిత్యకృత్యాలు తీర్చడానికి లిఫ్ట్ లోనే దాన్ని బయటకు తీసికెళ్తారు.అది లిఫ్టులో ఉండగా, ఏడు అంతస్థులూ మెట్లమీదుగానైనా వెళ్తానుగానీ, ఆ లిఫ్ట్ కి చుట్టుపక్కల ఎక్కడా ఉండను. ఈ కుక్కల్ని పెంచేవారికి వారి కుక్క చాలా అమాయకంగా ఉండి ఎవరినీ ఏమీచేయదూ అనే దురభిప్రాయం ఒకటి ఉంది. బహుశా యజమానిని ఏమీ చేయకపోవచ్చు, వారి కుటుంబ సభ్యులినీ, పనిచేసేవారినీ కూడా ఏమీ చేయకపోవచ్చు. అలాగని ఏదో యాధాలాపంగా ఎప్పుడో ఒకసారి చూసినవారిని ఏమీ చేయదని గ్యారెంటీ ఏమిటీ? కొంతమందికి ఓ చిత్రమైన అలవాటు ఒకటుంది,ఆ కుక్కకి చెయిను లాటిది ఏమీ ఉండదు, దానిదారిన అది అటూఇటూ వెళ్తూంటుంది, యజమాని పోనీ దానికి వెనక్కాల దగ్గరగా ఉంటాడా అంటే అదీ లెదు. ఎక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూనో, సెల్ లో ఎవరితొనో మాట్టాడుతూనో, అసలు తనకేమీ పట్టనట్టుగా నడుస్తూంటాడు. పాపం అంతనమ్మకం తన పెట్ మీద.అలాటి సమయంలో నాలాటి తలమాసినవాడెవడో అదే సందులోంచి వెళ్ళాల్సొస్తుంది, ఇంక చూసుకోండి… వెనక్కాల వచ్చే యజమానో, యజమానురాలో- कुछ नही करॅगा॥ అని రాష్ట్రభాషలోనూ, Dont worry it wont do anything.. అని ఇంగ్లీషులోనూ ఆశ్వాసన్ ఇచ్చేస్తారు. వాళ్ళకి సంబంధించినంతవరకూ అది రైటే కావొచ్చు, కానీ నాలాటి అర్భకప్రాణుల సంగతి మాత్రం వాళ్ళకి పట్టదు. దానికి నాతో అంత పరిచయం లేదాయె, దాన్ని చూడగానే నా pulpitations పెరిగిపోతాయి.ఇప్పటిదాకా నాకు BP పెరగడం అనేది లేదు, కానీ ప్రస్థుత పరిస్థితుల్లో ” పారా” (Mercury) కూడా పరిగెత్తేస్తుంది. చివరకి ఏం చేస్తానూ, సిగ్గు విడిచేసి వాళ్ళతో చెప్పేస్తాను, కొద్దిగా దాన్ని చూడండీ, మీ దారికీ, మీకుక్కగారి దారికీ ఎప్పుడూ రానూ అని చెప్పేస్తాను,చెప్పడమేకాదు ఆచరించేస్తాను కూడా. ఏదో మొత్తానికి వీధిన పడకుండా లాగించేస్తున్నాను.
ఇదివరకటి రోజుల్లో సొసైటీల్లో కుక్కలకి సంబంధించిన వారందరికీ కొన్ని నియమనిబంధనలు ఉండేవిట. అవేమిటో తెలిసికోడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదనుకోండి. కుక్క కళ్ళకి కనబడకుండా ఊంటే అదే నాకు పదివేలు. నా జాగ్రత్తలో నేనుంటాను.

    అన్నీ సవ్యంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుందీ? ఈ కుక్కల యాజమాన్యానికి ఈ నియమనిబంధాలు నచ్చలేదనుకుంటా. ఎక్కడైనా ఎవరికైనా కంట్రోల్ అనేది నచ్చదుగా, వాళ్ళెవరికో ఫిర్యాదు చేసినట్టున్నారు, సొసైటీ కార్యవర్గం వారు మామీదా, మా కుక్కలమీదా లేనిపోని ఆంక్షలు పెడుతున్నారు అవటా అని. పైగా దీనిలో fundamental rights ప్రస్తావించినట్టున్నారు. ఇంకేముందీ ఈ జంతువుల ప్రాధమిక హక్కులు పరిరక్షించేవాళ్ళు రంగంలోకి దిగేశారు. ఠాఠ్.. అదేమీకుదరదూ అని guidelines ఇచ్చేశారు. ఇక్కడ చదవండిBanning pets in societies illegal ఈ guidelines ధర్మమా అని, నాలాటివాళ్ళు తూర్పుకి తిరిగి దండం పెట్టడం తప్ప ఇంకో దిక్కులేదు… సర్వేజనాసుఖినోభవంతు…



Viewing all articles
Browse latest Browse all 266

Latest Images

Trending Articles


Adilabad district, telangana,komaram bheem,kuntala, nagoba, mancherial,...


40 ఏళ్లు వచ్చేశాయ్... యోని వదులు... నీ దగ్గర ఏముంది అంటాడు...


స్ట్రోక్స్ ఇవ్వలేను నువ్వే చేయంటున్నారు... నేనలా చేస్తే ఆయనకు, నాకూ తృప్తి...


అమరేంద్ర ‘‘బాహుబలి’’అనే నేను డైట్ విషయంలో రాజమాత సాక్షిగా !


శిష్ట్లా శారద గారు పాడిన దేవులపల్లి వారి గేయం


Mulugu Panchangam: ఫిబ్రవరి 25 మంగళవారం.. తిథి విదియ, రేవతి నక్షత్రం


కాబోయే భార్యతో అలా ప్రాక్టీస్ చేస్తున్నా... పెళ్లయ్యాక కూడా ఇంతేనా అంటోంది...


శారద లేఖలు( కనుపర్తి వరలక్ష్మమ్మ)


దిక్కు తెలియని దారి


నా ఆలోచనల పరంపర: నన్ను చూశాడు