పూర్వపు రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో గమనించిందేమిటంటే, మనుషుల్లో చాలామందికి , Sense of humour అనబడే “ హార్మోన్ “ తగ్గుముఖం పట్టినట్టనిపిస్తోంది. తగ్గుముఖమనే ఏమిటిలెండి, almost dried up అనుకోవచ్చు.ఇదివరకటి రోజుల్లో , వ్యంగ్య చిత్రాలు ( cartoon/ caricature ) వేసే ఘనా పాఠీలుండేవారు. వారి వ్యంగ్యం నుండి ఏ ప్రముఖ వ్యక్తీ కూడా తప్పించుకోలేదనడంలో ఆశ్చర్యం లేదు. ప్రముఖ కార్టూనిస్టులు Messers . RKLaxman, Abu Abraham, Oomen, Mario Miranda,Shankar, తెలుగుజాతికి స్వంతమైన శ్రీ బాపు గారూ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరెందరో… ఓ గొప్ప రాజకీయనాయకుడి పైన ఓ కార్టూన్ వేస్తే నవ్వకుండా ఉండలేకపోయేవారు, ఎవరిమీదైతే వేశారో ఆ వ్యక్తి తో సహా…
కానీ ఈరోజుల్లోనో—వ్యంగ్యంగా ఏదైనా వ్యాసం రాసినా, ఓ బొమ్మవేసినా అసలు విషయాన్ని పక్కకుపెట్టి, వాటిమీద వివాదాస్పక చర్చలు మొదలెడతాయి. ఎవరిగురించైతే వేసారొ ఆ వ్యక్తి లోపల్లోపల నవ్వుకున్నా కుదరదు. వారి వందిమాగధులకి పొడుచుకొస్తుంది… “ కందకి లేని దురద… “ సామెతలా. పైగా ఆ కార్టూన్ కి ఓ “ కుల / జాతి “ జెండా తగిలిస్తారు. ఇంక ప్రభుత్వం మీదా, అధికార పక్ష నాయకులమీదా వేస్తే “ దేశద్రోహం “ కింద పరిగణించి జైల్లో వేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అసలు గుమ్మిడికాయదొంగంటే భుజాలు తడుముకోవడం ఎందుకో ? “ఎంత నవ్వితే అంత ఆరోగ్యం “ అన్నది పోయి “ నవ్వు నాలుగువిధాల చేటు “ లోకి వచ్చేసింది.
సామాజిక మాధ్యమం ( Social Media ) లోకూడా అదే పరిస్థితి… ఎవరో ఏదో రాస్తారు తమ టైమ్ లైన్ మీద—స్పందించకపోతే బావుండదని, ఏదో తెలిసినవారు కదా అని వ్యాఖ్య పెడితే దాన్ని లైట్ గా తీసుకోవచ్చుగా అని స్పందించిన వ్యక్తి అనుకున్నా, మిగిలినవారికి “ దురద “ ఎక్కుతుంది…అంతే వ్యాఖ్యలమీద వ్యాఖ్యలు… తారీక్ పే తారీక్.. తారిక్ పే తారీక్ .. “ Ghayal సినిమాలో Sunny Deol లా వచ్చేస్తాయి… అసలు వ్యక్తికి పట్టింపులేకపోయినా, Peer Pressure ఎక్కువైపోతుంది… అసలు విషయం పక్కదారి పట్టి అటకెక్కేస్తుంది. కొంతమందుంటారు ఎంతమంది వ్యాఖ్యలు పెట్టినా, స్పందించని ఘనులు. ఏదో ప్రభుత్వంవారి పత్రికా ప్రకటన ధోరణిలో , అందరికీ కలిపి ధన్యవాదాలు చెప్పేవారు…. అలాటప్పుడు వ్యాఖ్యలు పెట్టేవారుకూడా మానేసే ఆస్కారం ఉందని మర్చిపోతారు. చివరకి ఏమౌతోందంటే వ్యాఖ్యలు పెడితే ఓ గొడవా, అసలు పెట్టకపోతే ఇంకో గొడవా..
ఇవన్నీ ఈరోజుల్లో Public domain లో ఈరోజుల్లో చూస్తూన్న మార్పులు… చివరకి ఈ drying up ప్రక్రియ నిజజీవితాల్లోకి కూడా వచ్చేస్తోంది.. మనం సరదాగా అనుకున్న మాట అవతలివారికి అభ్యంతకరంగా అనిపించొచ్చు.. అది స్నేహితుల మధ్య అవొచ్చు, తల్లితండ్రులు- పిల్లల మధ్య కూడా కనిపిస్తోంది… ఏదో చనువులాటిదుంటేనే కదా హాస్యంగా అప్పుడప్పుడు మాట్టాడేదీ? కొత్తగా పరిచయమైన వారితో ఎలాగూ ముభావంగానే ఉంటాము… మరీ మొదటి పరిచయంలోనే లొడలొడా వాగేయం కదా… అవతలివారి మనస్థత్వం ఓసారి అంచనా వేసి , రంగంలోకి దిగడం. .. మన మాట పధ్ధతి నచ్చిందా ఇంకోసారి కలవ్వొచ్చు, నచ్చలేదా, ఓ గొడవొదిలిందని వదిలేయొచ్చు. అలాగని మన Light hearted attitude మార్చుకోనవసరం లేదని ఇన్నాళ్ళూ అనుకునేవాడిని…
కానీ కొన్నిఅనుభవాలు జరిగితేనేకానీ నేర్చుకోలేముగా…. నోరుమూసుక్కూర్చుంటే అసలు గొడవే ఉండదుగా.. కానీ కూర్చోలేమే… కానీ ప్రయత్నించి చూడాలి.. బాగుపడొచ్చేమో…
Learning is an everlasting exercise….
