


పెళ్ళైన మొదటి 10 సంవత్సరాలూ, ప్రతీ ఏడూ, Marriage Anniversary రోజు February 28, న ఇక్కడ పుణె లో ఉన్న పార్వతి కొండకి వెళ్ళి , అమ్మవారి దర్శనం చేసుకునేవారం.. 1983 లో వరంగాం బదిలీమీద వెళ్ళి తిరిగి పుణె, 1998 లో వచ్చాము… పెళ్ళిరోజులైతే అప్పటినుండీ, ప్రతీ ఏడూ , చేసుకునేవాళ్ళం, అయినా ఏమిటో అమ్మవారి దర్శనానికి వెళ్ళడం మాత్రం కుదరలేదుఏమిటో ఆ లోటుమాత్రం కనిపించేది. అలాగని దైవ దర్శనాలు మానేమా, అబ్బే ఆ తల్లిని మర్చిపోవడమే ? No way.. గత అయిదారు సంవత్సరాలుగా, ప్రతీ ఏడూ, ఏదో ఒక పుణ్యక్షేత్రానికి, మా ” దేవదూత ” ల ధర్మమా అని వెళ్ళగలిగేమనుకోండీ, కానీ , ఈ ఏడాది, బయటకెక్కడికీ కాకుండా, ఈసారి పార్వతి కొండకే వెళ్ళాలని నిశ్చయించుకున్నాము. మొత్తానికి దాదాపు 30-32 సంవత్సరాల తరువాత, వెళ్ళి దర్శనం చేసుకోగలిగాము.
అప్పటికీ ఇప్పటికీ తేడా అల్లా ఏమిటంటే, ఆరోజుల్లో బస్సులు పట్టుకుని వెళ్ళేవాళ్ళమూ, ఇప్పుడేమో UBER లోనూ.. ఈ పెరుగుదల అంతా ఆ అమ్మ దయేగా.. ఆరోజుల్లో తెలిసేది కాదుకానీ, ఇప్పుడు కొండ ఎక్కినప్పుడైతే , వయసురీత్యా అయితేనేమిటి శ్రమపడాల్సొచ్చింది…
మేము వెళ్ళేటప్పటికి అంటే ఎంతా ఉదయం 9.30 కి, గుడి తలుపులు మూసున్నాయి.. అక్కడ ఉన్న సెక్యూరిటీ అతన్ని అడగ్గా , పాపం అతను పూజారికి ఫోనుచేసి పిలిచాడు. ఈలోపులో మేమిద్దరమూ, ఆ ప్రాంగణంలోనే, లలితాసహస్రనామం పారాయణ చేసుకున్నాము. పూజారి గారొచ్చిన తరువాత, అమ్మవారికి , చీర, పసుపు,కుంకం , నాభార్య సమర్పించుకుంది… గుడి చుట్టూ ఉండే ప్రహారి ఎక్కితే, పుణె నగరం ఎంతో సుందరంగా కనిపిస్తుంది.. నాకు ఓపిక లేక, వెళ్ళలేదు, తనే వెళ్ళింది.
ఆతరువాత విష్ణు మందిరం, గణపతి మందిరం, కార్తికేయమందిరం, విఠోబా మందిరం, బాజీరావు పీష్వా సమాధి, చివరగా పీష్వాల కాలంలో ఉపయోగించిన వస్తువులు, ఆయుధాలు, ఆనాటి చిత్రపటాలూ, వ్రాత ప్రతులూ… ఉంచిన సంగ్రహాలయ్ ( Museum ) కి వెళ్ళి, ఓ అరగంట అక్కడ గడిపాము.
ఓ కాఫీ తాగి, మెల్లిగా 12 గంటలకి కిందికి దిగాము. Overall it was a beautiful experience..
ఈసందర్భంలో శ్రీమతి PSM లక్ష్మి గారు సమర్పించిన ఒక విడియో లింక్ ఇస్తున్నాను.. ఆ గుడి వివరాలన్నీ, అద్భుతంగా వివరించారు.