సాయంత్రం 7 కి జైపూర్ లో, మొత్తానికి, ఏ అవాంతరాలూ లేకుండా land అయ్యాము. మొదటి మజిలీలో, airbnb ద్వారా వారెవరో family ఉండే ఇంట్లో, రెండు గదుల్లో సెటిలయ్యాము. సాయంత్రం రెండు cab లు చేసుకుని, City Centre లో ఉన్న Albert Hall Museum కి వెళ్ళి ఓ రెండు గంటలు గడిపాము . దారిలో బిర్లా మందిరం కూడా దూరం నుంచి, దర్శించుకుని, హొటల్లో డిన్నర్ తీసికుని, తిరిగి వెళ్ళాము. గేటు బయటుండే Calling Bell కొట్టడమేమిటీ, ఆ ఇంట్లో ఉండే కుక్క, భయంకరంగా అరవడం మొదలెట్టింది… వాళ్ళు దాన్ని కట్టేయగా, మెము నిర్భయంగా రూమ్ములో సెటిలయ్యాము… రూమ్ము బయటకి అడుగెడితో ఒట్టు. |